ప్రత్యేక హోదా ప్రతిపత్తి’లో వాస్తవాలు ఇవీ

‘ప్రత్యేక హోదా ప్రతిపత్తి’లో వాస్తవాలు ఇవీ..

అలనాడు బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నిజం నిద్రలేచి నడక ప్రారంభించేటప్పటికి అబద్ధం ప్రపంచాన్నంతా చుట్టి వస్తుందని’. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రచార మాధ్యమాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చేసిన ప్రచారం- చర్చిల్ వ్యాఖ్యలకు అక్షరాలా అద్దం పడుతుంది. మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను వక్రీకరించి 14వ ఆర్థిక సంఘం నివేదిక తరువాత జరిగిన పరిణామాలను విస్మరిస్తూ ఈ ప్రచారం జరిగింది. రిపోర్టులో ఒకటి వ్రాసి, ఆ పైన మరొక విధంగా వ్యాఖ్యానించిన కొందరు ఆర్థిక సంఘం సభ్యులు కూడా ఈ ప్రచారానికి ఊతం కల్పించారు.
ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ముందు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పార్లమెంటులో ఎటువంటి ప్రకటన చేశారో ఒకసారి పరిశీలిద్దాం. వారి ప్రకటన ఈ కింది విధంగా ఉంది.
కేంద్ర సహాయం కోసం ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐదు సంవత్సరాలు వర్తింప చేస్తాము. దీనివలన రాష్ట్ర ఆర్థిక వనరులు బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇది మొదటి పేరాగ్రాఫ్. ఇక రెండవ పేరాగ్రాఫ్‌లో పరిశ్రమ రాయితీలు గురించి ఈ కింది విధంగా ఉంది. Read More

ఏపీ రెవెన్యూ లోటు అంచనాలోనూ రాజకీయమే!


రాష్ట్ర విభజన అనంతరం 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ రెవెన్యూ లోటు వెలితిని ఆనాడు గవర్నర్‌ 16 వేల కోట్లుగా అంచనా వేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఆదాయం అంచనాల కన్నా ఎక్కువ పెరగటం వలన, ఖర్చు అదుపులో ఉండటం వలన 2014 డిసెంబర్‌ నాటికి ఈ రెవెన్యూ లోటు మూడు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఉండదని తేటతెల్లమైంది. కానీ 2015 జనవరి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు వెచ్చించి ఈ లోటును 16,078 కోట్లకు పెంచడమైంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చనే అవాస్తవిక ధీమాతో రెవెన్యూ లోటు పెంచి ఈ మొత్తాన్ని భర్తీ చేయవలసిందిగా కేంద్రాన్ని కోరటం జరిగింది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాల అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇది ఈ అంశంపై అపోహకు, వాస్తవానికి ఉన్న తేడా. Read More

పదేళ్ల పనులు నాలుగేళ్లలో అవుతాయా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనలో భాగంగా విభజన చట్టంలోనూ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రకటనలోనూ ఆంధ్రప్ర

 దేశ్‌ రాష్ట్రానికి కొన్ని వాగ్దా నాలు చేయడమైనది. విద్య మౌలిక సదుపాయాల సంస్థల ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలోని 93 సెక్షన్లో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల స్థిరమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ 13లో పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం

పదేళ్ల కాలపరిమితిలో చేపట్టాలని పేర్కొన్నారు. తదనుగుణంగా 13వ షెడ్యూల్లో విద్యాపరమైన కొన్ని సంస్థలను మౌలిక సదుపాయాలకు సంబంధించి మరికొన్ని సంస్థలను ప్రస్తావించటం జరిగింది.

Read More

విభజన వాగ్దానాలు-అమలు

ఇదే దినపత్రికలో ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 46 క్రింద రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమున్నది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వాస్తవానికి అపోహకు ఉన్న తేడా ఏంది అనే అంశాన్ని విశదీకరించటం జరిగింది. ఈ వ్యాసంలో వెనుకబడిన ప్రాంతాలకు సహాయ సహకారం క్రింద పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఏమున్నది కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందింది అనే అంశాన్ని పరిశీలిద్దాం.

వెనుకబడిన ప్రాంతాలకు సహాయం చేయడం అనే అంశం పునర్విభజన చట్టంలో రెండు ప్రాంతాలలో పేర్కొనడం జరిగింది.సెక్షన్ 46 కింద కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల వరకే ఈ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పరిమితం చేయడం జరిగింది. కానీ సెక్షన్ 94 లో ఈ అంశాన్ని తెలంగాణలో  ఆంధ్రాలోని వెనకబడిన జిల్లాలలో భౌతిక సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయాన్ని అందించే విధంగా ప్రస్తావించారు. ఈ రెండు సెక్షన్ల లోని అంశాలను అన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం గుర్తింపబడిన వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఆరు సంవత్సరాల కోసం ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపబడిన 7 ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు  తెలంగాణలో గుర్తించబడిన 9 వెనకబడిన జిల్లాలకు ఈ అభివృద్ధి ప్రణాళిక వర్తిస్తుంది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల కు ఆంధ్ర రాష్ట్రానికి మూడు సంవత్సరాలకు సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 వ సంవత్సరానికి ఇచ్చిన గ్రాంట్ ను కొన్ని విధాన పరమైన అంశాల దృష్ట్యా వెనక్కు తీసుకున్నామని తగిన సమయంలో తిరిగి ఇవ్వటం జరుగుతుందని ఈ మధ్యనే లిఖితపూర్వకమైన జవాబు ద్వారా కేంద్ర ప్రభుత్వం లోకసభ సభ్యులు రామ మోహన్ నాయుడు గారికి తెలియ జేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు ఇచ్చిన గ్రాంట్ల వినియోగ పత్రాన్ని సమర్పించినా దానికి సంబంధించిన కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని దీనిని బట్టి అర్థం అవుతుంది. ఈ ప్యాకేజీ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఆరు సంవత్సరాల కోసం రూపొందించింది కనుక నాలుగు సంవత్సరాల కు  మాత్రమే కాకుండా మిగిలిన రెండు సంవత్సరాల మొత్తాలు కూడా కొన్ని రోజులు అటూ ఇటుగా రావటం అయితే తధ్యం.

 

ఈ వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ విషయంలో విమర్శలు చేసే వారు ప్రధానంగా ప్రస్తావించే అంశం, పునర్ విభజన చట్టంలోని సెక్షన్లను ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాలతో కలిపి చదవాలని  ఆయన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని పేర్కొన్నారని ఆ స్థాయిలో నిధులు విడుదల చేయాలని పేర్కొంటారు. వీరు ఇందులో ప్రధానంగా విస్మరించిన అంశం బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీలలో ప్రభుత్వం చే అప్పటికే అమలు చేయబడుతున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాల మొత్తాన్ని కూడా భాగంగా చూపెడతారు. ఉదాహరణకు మహాత్మా గాంధీ ఉద్యోగ హామీ పథకం లాంటి అనేక కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధులను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా చూపెట్టి ప్యాకేజి స్థాయిని పెంచడం జరుగుతుంది. ఆ వివిధ కార్యక్రమాల కింద వచ్చే నిధులను కలపకపోతే ఆ రాష్ట్రాలకు కూడా ఈ స్కీమ్ కింద వచ్చే నిధులు మన కన్నా ఎక్కువ ఏమీ ఉండవు. ఈ అంశాన్ని విస్మరించి బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీలకి విపరీత ప్రచారాన్ని ఇవ్వటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

94 వ సెక్షన్ లో పరిశ్రమల రాయితీలను కూడా పేర్కొనడం జరిగింది. తదనుగుణంగా పైన గుర్తించిన వెనకబడిన జిల్లాలకు 2015- 20 మధ్య పెట్టిన పరిశ్రమలపై అదనంగా 15 శాతం తరుగుదల(depreciation) 15 శాతం ఏర్పాటుచేసిన యంత్రాల పైన పెట్టుబడి అలవెన్స్ పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది.

ఇదే 94 వ సెక్షన్ లో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలో అసెంబ్లీ రాజ్ భవన్ హైకోర్టు సెక్రటేరియట్ లాంటి భవనాలతో పాటు ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని పేర్కొనడం జరిగింది. దీనికనుగుణంగా 1500 కోట్ల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించడం జరిగింది.

రాష్ట్రంలో అసత్య ప్రచారాలతో ఏర్పడిన అపోహకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టం లోని‌ సెక్షన్లు మరియు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రకటన కనుగుణంగా సహాయ సహకారాలు గత నాలుగు సంవత్సరాల నుంచి అందిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ మాత్రం ఇచ్చిన సహాయాన్ని పూర్తిగా విస్మరించి పరిశీలనలో ఉన్న అంశాలనే భూతద్దంలో చూపెడుతూ ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *